108 వాహనాల కొనుగోళ్లలో చంద్రబాబు అవినీతి

Laxma reddy
Laxma reddy

రంగారెడ్డి: ఏపి రాష్ట్రంలో 108 వాహనాల కొనుగోళ్లలో ఏపి సియం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ కంటే రూ.4 లక్షలు ఎక్కువ పెట్టి ఏపి ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో కరవు పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తెచ్చి దోచుకున్నారని మండిపడ్డారు. ఏపిలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ధ్వజమెత్తుతామన్నారు.