100 కిలో మీట‌ర్ల‌కు చేరిన పాద‌యాత్ర‌

jagan
jagan

ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూ, చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వం చేస్తోన్న అన్యాయాన్ని వివ‌రిస్తానంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొద‌లుపెట్టిన పాద‌యాత్ర ఎనిమిదో రోజుకి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు 100 కిలోమీట‌ర్లు న‌డిచారు. కాసేప‌ట్లో ఆయ‌న క‌ర్నూలు జిల్లాలోని చాగ‌లమ‌ర్రికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ విద్యార్థులు, స్థానికుల‌తో ముచ్చ‌టించి అనంత‌రం ముత్యాలపాడు బస్టాండ్ లో ప్రజా సమావేశంలో పాల్గొంటారు. ఆ త‌రువాత‌ సెట్టివేడు మీదుగా గొడగనూర్‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు రాత్రికి జ‌గ‌న్మోహన్ రెడ్డి చక్రవర్తులపల్లిలో బస చేస్తారు.