కర్నూలు జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

నగరపాలక సంస్థలో ఎనమిది మంది ఉద్యోగులకు కరోనా నిర్ధారణ

kurnool
kurnool

కర్నూలు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు వారికి వైద్యం చేసే వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా నగరపాలక సంస్థలోని ఎనమిది మంది ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 466 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అయిన జిల్లాగా కర్నూలు అవతరించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తూ, కరోనా నివారణ చర్యలను చేపడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/