ఏపిలో మరో 50 శాతం మద్యం ధరలు పెంపు?

ప్రజలను మద్యానికి దూరం చేసేందుకే అంటున్న ప్రభుత్వం!

wine shop
wine shop

అమరావతి: ఏపిలో మద్యం ధరలు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే మద్యం ధరలను మరో 50 శాతం పెంచాలని ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఏపిలో నిన్న మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. మద్యం దుకాణాలు ఓపెన్‌ చేస్తునే ప్రభుత్వం 25 శాతం మద్యం ధరలను పెంచింది. అయినప్పటికి ప్రజలు మద్యం కోసం దుకాణాల ముందు బారులు తీరడం, సామాజిక దూరం పాటించకపోవడంతో, మద్యం ధరలను మరో 50 శాతం పెంచి ప్రజలను వైన్‌ షాపులకు దూరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలనుసారం మద్యం ధలను పెంచినట్లు స్పెషల్‌ సిఎస్‌ రజత్‌ భార్గవ్‌ వెల్లడించారు. కాగా నిన్న పెరిగిన 25 శాతం ధరలతో కలిపి మద్యం ధరలు మొత్తం 75 శాతం మేర పెరిగాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/