అనిశాకి పట్టుబడ్డ రెవెన్యూ అధికారి

 

ACB
ACB

శ్రీకాకుళం: సరుబుజ్జిలి మండలం తహసీల్దార్‌ కార్యాయలంలో డిప్యూటీ తహసీల్దార్‌ పనిచేస్తున్న ఎం.నాగేంద్ర ప్రసాద్‌ రూ.10వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అదికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ రైతు వద్ద భూ యాజమాన్య పత్రాలు ధృవీకరించడానికి డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. సదరు ఆ రైతు అనిశాను ఆశ్రయించడంతో పథకం ప్రకారం తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.