హోదా ఇస్తామని మోది చెప్పలేదు

kanna laxminarayana
kanna laxminarayana

విజయనగరం: తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోది చెప్పలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోది వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌పై పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉందని కన్నా తెలిపారు. భవిష్యత్‌లో టిడిపితో కలిసే ప్రశక్తే లేదని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.