హోదాపై టిడిపి ఎంపీల నిరసనలు

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నేడు టిడిపి ఎంపీలు ధర్నాకు దిగారు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విశాఖరైల్వేజోన్‌ మంజూరు చేయాలని, విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని టిడిపి ఎంపీలు తేల్చి చెప్పారు.