హోదాపై అలుపెర‌గ‌ని పోరాటంః టిడిపి ఎంపీలు

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి  న్యాయం జరిగే వరకు అలుపెర‌గ‌ని పోరాటాన్ని చేస్తామ‌ని టీడీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు  అంటున్నారు. ఢిల్లిలో ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ మా హక్కుల సాధన కోసమే ఇక్కడికి వచ్చామన్నారు. మా గొంతులునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయమంటే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.