హైదరాబాద్‌ వదిలి రావాడానికి ఎవరూ ఇష్టపడారు

Chandrababu
Chandrababu

అమరావతి: హైదరాబాద్‌ను తాను నిర్మించానని అనలేదని, సైబరాబాద్‌ సిటికి తాను రూపకల్పన చేశానని చెప్పినట్లు ఏపి సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో సిఎం మాట్లాడుతు కెసిఆర్‌ నన్ను చూసి ఎగతాళి చేశారన్నారు. కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌ తప్ప ఏమీ నిర్మించలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైబరాబాద్‌ తన మానస పుత్రికని అన్నారు. ఐటీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తానే రూపకల్పన చేశానని చంద్రబాబు చెప్పారు. తన చర్యల వల్లే తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆస్తిగా మారిందన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ వదిలి రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.