హైకోర్టులో రోజా పిటిషన్‌

ROJA
ROJA

తిరుమల: తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయండం దారుణం అని ఎమ్మెల్యె రోజా అన్నారు. వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రజల మనోభావాలని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విషయాన్ని ఎన్ని సార్లు అధికారుల దృష్టకి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు అని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని రోజా అన్నారు.