స్విమ్స్‌లో మ‌రో మెడికో ఆత్మ‌హ‌త్య‌

Suicided
Medical Student Suicide

తిరుప‌తిః వైద్యురాలు శిల్ప ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రాకముందేతిరుపతి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర వైద్య‌ కళాశాలలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గీతిక ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్ లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గీతికను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గీతిక కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. గీతిక ఆత్మహత్యకు గల కారణాలు, మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.