స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

tirupati swami copy
tirupati swami

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను టిటిడి ఇఒ అనిల్‌కుమార్‌ ఈ రోజే విడుదల చేశారు. జనవరి నెల కోటాలో మొత్తం 68,575 టికెట్లు విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా 7,125 సేవా టికెట్లు విడుదల చేశారు. అంతేకాకుండా సుప్రభాతసేవ-4,425, తోమాల అర్చన-160, అష్టదళపాదపద్మారాధన-240,నిజపాద దర్శనం 2300 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే విశేషపూజ -2000, కల్యాణం-13,775, వసంతోత్సవం -15,950,సహస్రదీపాలంకారసేవ -17,400 టికెట్లను విడుదల చేసినట్లు టిటిడి ఇఒ తెలిపారు.