సోము వీర్రాజుపై ఏపిసిసి వాఖ్యలు

Congress Party
APCC

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోము వీర్రాజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా తరచూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపిసిసి ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఐదు కోట్ల మంది కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు విరుద్ధంగా ఆయన మాట్లాడటం తగదని ఏపిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. కారణాలేమైనా ఆంధ్రప్రదేశ్‌కు మెదీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గళం ఎత్తడం, ఎంపీలతో పార్లమెంట్‌లో ఆందోళన చేయించడం మంచి పరిణామమే అన్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం కకమ్మ కథలు చెబుతూ మభ్య పెట్టాలనుకుంటున్నారని అన్నారు.