సోమిరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమైనవి

ROJA
ROJA

తిరుమల: ఏపి ఎమ్యెల్యె రోజా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పాదయాత్ర ముగింపు సభకు జనం రాలేదన్న సోమిరెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ఐదుసార్లు ఓడిన సోమిరెడ్డి.. మంత్రి పదవి చేపట్టినందుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టినందుకు సిగ్గుపడాలన్నారు. కోడికత్తి కేసులో టిడిపి నేతలు జైలుకు వెళ్లే సమయం దగ్గర్లోనే ఉందని రోజా అన్నారు.