సీమలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి: మాజీ ఎంపీ

 

Chintha Mohan
Chintha Mohan

రాష్ట్ర విభజనలో ఆంధ్ర రాష్ట్రానికి, ఒకవైపు రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ డాక్టర్‌ చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు నెలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇవ్వాలని కోరారు. బుధవారం తిరుపతి మున్సిపల్‌ కార్పోరేషన్‌ కార్యాలయంలో ధర్నా జరిగింఇ. ఈ సందర్భంగా చింతామోహన్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రాయలసీమ వాసులను విస్మరిస్తుందన్నారు. ఈ ధర్నాలో నాయకులు ప్రమీల, శ్రీనివాస్‌, శ్రీదేవి, టి.గోపాల్‌, తేజోపతి పాల్గొన్నారు.