సీమకు అందనంత దూరంలో హైకోర్టు

tulasi reddy
tulasi reddy

tulasi reddytulasi reddy

అమరావతి: రాయలసీమకు రావాల్సిన హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేయడం దారుణమని, సీమకు అందనంత దూరంలో హైకోర్టు ఏర్పాటు ఏంటని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో కనీసం హైకోర్టు బెంచ్‌ ఐనా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని తులసిరెడ్డి అన్నారు. రాయలసీమ నుంచి హైకోర్టు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.