సీఎం ర‌మేష్ దీక్ష‌కు క‌నిమొళి సంఘీభావం

Kanimozhi
Kanimozhi

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంపీ సీఎం రమేశ్‌ ఏడురోజులుగా దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ఆయన దీక్షకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారన్నారు. మోడీని నమ్మి చంద్రబాబు మోసపోయారన్నారు. హోదా వల్ల భవిష్యత్‌ తరాలకు ఎన్నో లాభాలున్నాయన్నారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం మాట మార్చిందన్నారు.