సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ

mudragada
Mudragada Padmanabham

రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరుతున్నారని, మరి, తమకు ఇచ్చిన హామీల సంగతేమిటని కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు ఆయన మరోమారు లేఖ రాశారు. ఏపికి ప్రత్యేకహోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన రోజుకోమాట అబద్ధమాడుతున్నారని, ఒటుకు నోటు కేసుకు భయపడి విజయవాడకు పారిపోయి వచ్చింది నిజం కాదా? అని చంద్రబాబును ఆ లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఇప్పటికైనా మోసాలు అవి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు.