సిఎం చంద్రబాబే మరో మహిసాసురుడు : జగన్‌ విమర్శ

JAGAN----
JAGAN-

చంద్రబాబే మరో మహిసాసురుడు : జగన్‌ విమర్శ

బొబ్బిలిరూరల్‌: చంద్రబాబే మరోమైశాశురుడని రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌జగన్‌మోహనరెడ్డి ఎద్దేవాచేసారు. బుద వారం బొబ్బిలిపట్టణంలో కళాభారతి రోడ్డులో ప్రజాసంకల్పయాత్రలో బాగగంగా బారీ భహిరంగ సభ పార్టీ ఇన్‌చార్జి శంబంగివెంకట చినప్పులనాయుడు ఆధ్వర్యంలో నిర్వహిచారు. ఈసభలో వైఎస్‌జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రే మరోహిశాశురుడని ఆరోపిం చారు. నీతినియమాలు పాటించని పాలనతో మన నారాశురుడు ఉన్నాడని అన్నారు. వీరిబొబ్బిలి చరిత్రను జగన్‌ ప్రస్తావిస్తూ నాటిరాజుల కొలువు నేటిరాజులుకు లేకపోయిం దిఅన్నారు. ఫౌరుషానికి మారుపేరైన బొబ్బిలిపేరును మంటకలిపారాన్నారు. ఒకపార్టీ నుంచి గెలిచి పదవీవ్యామోహాంతో మరో పార్టీలోకి జంప్‌అయ్యారని అన్నారు. బొబ్బిలి రాజులు అబివృద్దిచేయాలని పార్టీనీవీడి తెలుగు దేశంపార్టీలో చేరి ఏమి సాదించారని ప్రశ్నిం చారు.

మంత్రి ఇలాకాలో అన్నీ గనులు మాఫీ యా జరగడం గమనించాలన్నారు. 16మాం గనీసు గనులు అక్రమ మైనింగు జరగితే మన మంత్రిఏమి చేస్తూన్నారని అన్నారు.పాతబొబ్బిలి లో గిరిజనులుకు ఇచ్చిన భూములు ఒకటిన్నర కోట్లుకు అమ్ముకొన్నారని అన్నారు.వేగావతి, చంపావతి, మొదలగులపరివాహాక ప్రాంతాలలో ఉన్న ఇసుకనుదోచుకొన్నారనిఅన్నారు . తోటపల్లి ఫ్రోజెక్టు9సంవత్సరాలు గాలికివదిలేసారని అన్నా రు. ఈ ప్రోజెక్టు వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి పరుగులు తీయించారుని అన్నారు.10శాతం పనులు ఉండిపోతే దానిలో 80శాతం పనులుకూడా చేయలేదని అన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌లోఉన్న ప్రభుత్వ సుగర్‌ప్యాక్టరీనీ ఎన్‌సిఎస్‌కు 20కోట్లురూపాయలుకు అమ్మేసారనిఅన్నారు. 12కోట్లురూపాయలు రైతులుకు గతసంవత్సరం బకాయులు చెల్లించకపోయనా ,కార్మికులకు జీతా లు చెల్లించకపోయినా మననాయకులు ఏమిచేస్తూన్నారో చూడండిఅని అన్నారు.

జ్యూట్‌ మిల్లు మూతపడి కార్మికులు రోడ్డునుపడ్డారని వారిని ఆదుకోలేని చాతకాని ప్రభుత్వం అన్నారు.గొల్లాదివద్ద వంతన కట్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి దాని జాడలేదని అన్నారు.పట్టణప రిధిలో తాగునీరు ఇవ్వవలసిన మున్సిపాలటీ రెండురోజులు ఒకసారి తాగునీరు అందించడం ఈప్రభుత్వ వైఫల్యమన్నారు. వైఎస్‌ హయాంలో ఉండడానికి ఇల్లు లక్షలసంఖ్యలోఇల్లునిర్మించినా ఇప్పుడు గ్రామానికి ఒక్క ఇల్లుకూడా నిర్మించలేదన్నారు. బాబు వస్తేజాబు వస్తాదని నమ్మకంతో ప్రజలు బాబును గెలిపంచారని తీరా అధిఆకారంలోకివచ్చిన తరువాత ఉన్న ఉద్యో గాలు ఊడాయాన్నారు.మాయమాటలు చెప్పిఅధికారంలోకి వచ్చిన బాబు ఇప్పుటు వాటి ని తుంగలోకి తొక్కారన్నారు. ఎన్నికల్లోపొందు పరిచిన 600హామీలు ఒక్కటికూడా అమలుకు నోచుకోలేదన్నారు. డోక్రామహిలకు పసుపు కుంకమ పేరుతో మోసం చేస్తూన్నామన్నారు.

చంద్రబాబే420అన్నారు.అన్నీ రైతు రుణమాఫీ చేస్తామని రైతులును మోసం చేసారని అన్నారు. మేము అధికారం లోకివస్తే అన్నీ ఉచిత . ఇంగ్లీసు మీడియంపేరుతో మున్సిపల్‌పాఠశాలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టారన్నారు. . డాక్టర్లు ,కలెక్టర్‌, ఇంజనీరు చదివించే భాద్యత తీసుకొంటామనిఅన్నారు. మీపిల్లలను పాఠశాలకు పంపిస్తే ఏడాదికి 15వేలరూపాయలు తల్లిదండ్రల ఖాతాలోవేస్తాని హామీఇచ్చారు. మూతపడినిపాఠశాలను తెరిపించి ఖాలీగా ఉన్నఉపాధ్యాయ ఫోష్టులన్నీ భర్తీచేసి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చు తానాన్నరు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి బొత్ససత్యానారాయణ, మాజీ ఎంపి బొత్సఘాన్సీలక్ష్మి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్షశ్రీవాణీ, ఎంఎల్‌సి కోలగట్ల వీరభధ్రస్వామి, పక్కి సర్పంచ్‌ శంబంగివేణు గోపాలనాయుడు, వాసిరెడ్డివరదరామారావు, చిన్నశ్రీను, పార్వతీ పురం నియోజకర్గఇన్‌చార్జి అలజంగిజోగారావు పాల్గొన్నారు.