సంతానంపై నిబంధనను తొలగిస్తాం

ap cm babu
ap cm babu

అమరావతి: గత పదేళ్లుగా ఏపిలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, జనాభా పెరగాల్సిన అవసరం ఉందని సియం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మానవ వనరుల అభివృద్ధిపై సియం ఆరో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య రంగంలో 24 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సియం ఆరోగ్య కేంద్రాలు ఎన్టీఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్‌ బేబి కిట్స్‌, చంద్రన్న సంచార చికిత్స పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్‌ తో పాటు రూ. 2500 పింఛను ఇస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానంపై నిబంధనను తొలగిస్తామని చంద్రబాబు తెలిపారు.