షియోమి ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం

AP CM BABU
AP CM BABU

చిత్తూరుః ముఖ్యమంత్రి చంద్రబాబుతో షియామి సంస్థ ప్రతినిధులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియామి పరిశ్రమ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీలో రూ. 4వేల కోట్లతో సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమను షియామీ సంస్థ ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. మంత్రులు నారా లోకేష్‌, అమర్‌నాథ్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి లోకేష్ షియామి సంస్థ ప్రతినిధులకు వివరించనున్నారు.