వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూక్‌

nmd farooq
nmd farooq

అమరావతి: వైద్య ఆరోగ్య, మైనారిటి శాఖ మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూక్‌ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు పేదల సంక్షేమం కోసం వైద్య సేవలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. స్వైన్‌ ప్లూ కేసులు కర్నూల్‌ జిల్లాలో ఎక్కువగా నమోదుయ్యామని అన్నారు. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు కల్పించాలని నిర్ణయించామన్నారు. వైద్యుల కొరత ఉన్న చోట ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. మెడికల్, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతామన్నారు