వైఎస్‌ఆర్‌సిపి పుట్టిందే మోసాలపైన

ap cm, Chandrababu naidu
ap cm ,Chandrababu naidu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు ఈరోజు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు జగన్‌ మాయా రాజకీయం మనరాష్ట్రంలో చెల్లదని, వైఎస్‌ఆర్‌సిపి పుట్టిందే మోసాలపైన, నేరాలపైన అని చంద్రబాబు మండిపడ్డారు.అప్పుడు జగన్ బోగస్ షేర్ల మాయాజాలం చేశారని, ఇప్పుడు జగన్ దొంగఓట్ల మాయాజాలం ప్రారంభించారన్నారు ఓట్లు పోయినవాళ్లంతా వైఎస్‌ఆర్‌సిపిని నిలదీయాలని, ప్రజల్లో దోషిగా వైఎస్‌ఆర్‌సిపిని నిలబెట్టాలని చంద్రబాబు అన్నారు.