వైఎస్‌ఆర్‌సిపి,జనసేన పార్టీలకు స్వప్రయోజనాలే ముఖ్యం

KALA VENKATARAO
KALA VENKATARAO

విజయనగరం: విజయనగరంలోని అతిథి గృహంలో ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈరోజు మీడియాతో మాట్లాడుతు బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యామని ఆయన ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి, జనసేన పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు ముఖ్యమని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత జగన్‌క సమయమే లేదని ఎద్దేవా చేశారు. జనసేన పవన్‌కల్యాణ్‌ అయోమయంలో ఉన్నారని అన్నారు. విజయనగరం జిల్లా సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది లేకుండా అనిన ప్రాజేక్టులు పూర్తిచేస్తున్నామని ఆయన అన్నారు.