వేసవిలో మంచినీటి సమస్య రానివ్వం

AP MINISTER LOKESH
AP MINISTER LOKESH

వేసవిలో మంచినీటి సమస్య రానివ్వం

అమరావతి: రాష్ట్రంలో వేసవికాలంలో ప్రజలకు మంచినీటి ఎద్దడి ఎదురవ్వకుండా నిరంతరం మంచినీటిని సరఫరా చేయాలని రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజలెవరికైనా తాగునీటి సమస్య ఎదురైతే జలవాణి కాల్‌ సెంటర్‌ 1800 425 1899 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచిం చారు. ప్రజలకు ఈ జలవాణి నెంబర్‌పై అవగా హన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమస్యను పరిష్కరించిన తరువాత ఐవిఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని ఆదేశించారు.