విశాఖ‌కు రైల్వే జోన్‌పై మంత్రికి ఎంపీ లేఖ‌

RAmmohan naidu
RAmmohan naidu

న్యూఢిల్లీ : విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో కలిపి విశాఖ జోన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సూచించిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ కేటాయించాలని కోరారు. ఏపీకి రైల్వేజోన్ సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రకటన చేశారని, కానీ రాష్ట్రంలో రైల్వే విస్తరణ అధిక సంఖ్యలో ఉన్నందున రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిందేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు.