హామీలు సాధించుకోలేని చేతకాని సిఎం: రోజా

ROJA
ROJA

విభజన హామీలు సాధించుకోలేని చేతకాని సిఎం: రోజా

తణుకు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హమీలు సాధించుకోలేని చేతకాని సిఎం చంద్రబాబని, టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్సార్సీ ఆంధ్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్యెల్యే ఆర్‌కె రోజా అన్నారు. శనివారం మహిళా సదస్సులో పాల్గొనేందకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలు పక్కనపెట్టి తెలంగాణలో తిరుగుతూ అధికారంకోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబును ఎపి నుంచి తరమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన కాంగ్రెస్‌తో పొత్తు దేశభవిష్యత్‌కోసం, వ్యవస్దలను కాపాడుటకోసం చారిత్రిక కలయకని చెప్పడం సిగ్గుచేటున్నారు. ముఖ్యమంత్రి స్దాయిలో రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా,విభజన హమీలు తీసుకురాలేని చేతకాని సిఎంగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.