విజిలెన్స్‌ డిజిగా గౌతమ్‌ సవాంగ్‌

GAUTAM SAWANG
GAUTAM SAWANG

విజయవాడ: రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసి బస్‌భవన్‌లోని విజిలెన్స్‌ విభాగం ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు ఆ విభాగం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న హోంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లు విజయవాడ నగర పోలీసు కమీషనర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు-ప్రభుత్వ సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేశామని ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం విజిలెన్స్‌ విభాగానికి పూర్తిస్థాయి డిజి నియామకం ఇదేనని వెల్లడించారు. ఈ విభాగంలో కొన్ని కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని ,వీటిపై సమీక్షించి సియంకి నివేదిక అందజేస్తామన్నారు.