విజయవాడ-సింగపూర్‌కు రేపు విమాన సర్వీస్‌ ప్రారంభం

VIJAYAWADA AIRPORT
VIJAYAWADA AIRPORT

విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుండి రేపు సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నట్లు కలెక్టరు బి. లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయడు విమాన సర్వీసును ప్రారంభిస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇక్కడి నుండి సింగపూర్‌కు విమాన సర్వీస్‌లు ప్రారంభం కావడం ముఖ్యమైన ఘటమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.40గంటలకు ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6.45గంటలకు సింగపూర్‌కు బయలుదేరుతుందన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనన్నుట్టు కలెక్టరు పేర్కొన్నారు