వాలంటీర్లకు ఏం తక్కువ?

  • వాలంటీర్లను పిల్లనివ్వరని బాబు అంటున్నారు
Vijayasai Reddy
Vijayasai Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు, నేత నారా లోకేశ్ లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎక్కసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్రయోజకుడు, అజ్ఞాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/