ల‌బ్ద‌దారుల‌కు రుణాల చెక్కులు మంత్రి అంద‌జేత

P. Pulla rao
P. Pulla rao

గుంటూరుః చిలకలూరిపేటలో 21,066 మందికి రూ.37.42కోట్ల చెక్కులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. చిలకలూరిపేటలో ‘జన్మభూమి-మాఊరు’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపు లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేశారు. అలాగే 7799 మందికి రూ.10.87కోట్ల వడ్డీలేని రుణాలను మంత్రి పంపిణీ చేశారు. 305మంది దుల్హన్ చెక్కులను పంపిణీ చేశారు. జన్మభూమిలో పనిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.