ర‌హ‌దారి ప‌నుల‌ను అడ్డుకున్న రైతులు

ap secretariat
ap secretariat

అమ‌రావ‌తిః అమరావతిలోని సచివాలయం వద్ద సీఆర్‌డీఏ నిర్మిస్తున్న రహదారి పనులను అడ్డుకున్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి వెలగపూడి సచివాలయం సీఎం బ్లాకు వెనుక ఉన్న భూమిలో పరిహారం ఇవ్వకుండా సీఆర్‌డీఏ రహదారి పనులు చేస్తోందంటూ రైతు గద్దె మీరా ప్రసాద్ అడ్డుకున్నారు. ఆయనకు మద్దతుగా మరికొంత మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. సుమారు అరగంటకు పైగా ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తమ పొలంలో అన్యాయంగా రహదారి నిర్మిస్తే ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరా ప్రసాద్ హెచ్చరించారు. దీంతో పోలీసులు రైతులను బలవంతంగా పక్కకు తొలగించి పనులు కొనసాగించారు.