రోడ్ల అభివృద్ధికి రూ.2,400 కోట్లు

AP MINISTER AYYNA PATRUDU
AP MINISTER AYYNA PATRUDU

రోడ్ల అభివృద్ధికి రూ.2,400 కోట్లు

విశాఖపట్నం: రాష్ట్రంలో రూ.2400 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రోడ్లను వెడల్పు మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ మొత్తంలో వెయ్యి కోట్లను విజయబ్యాంకు వారు రుణంగా ఇస్తున్నారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు కేటాయించినట్టు వెల్లడించారు.