రైల్వే జోన్ సాధ‌న‌కై ఎంపీ రామ్మోహ‌న్ దీక్ష‌

Rammohan naidu
Rammohan naidu

విశాఖపట్నానికి రైల్వే జోన్‌ డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్షకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస రైల్వే స్టేషన్‌కి తమ కార్యకర్తలతో వచ్చిన ఆయన అక్కడే 12 గంటల దీక్షను ప్రారంభించారు. రేపు ఉదయం 7 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే క్రమంలో తాము పోరాడుతూనే ఉంటామని తెలిపారు. కేంద్ర సర్కారు విభజన హామీలను అమలు చేయట్లేదని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తాను దీక్షకు దిగానని అన్నారు. టీడీపీని దెబ్బతీయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వే జోను ఆంధ్ర ప్రజల హక్కని నినదించారు.