రైల్వే జోన్ వ‌చ్చే వ‌ర‌కు ప‌ట్టు విడువం

Rammohan naidu
Rammohan naidu

విశాఖః రైల్వేజోన్ ప్రకటించే వరకు ఉద్యమం ప‌ట్టు విడ‌వం అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. హామీలు సాధించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన తెగేసిచెప్పారు. గుజరాత్ రాజకీయాలు ఏపీలో పనిచేయవని, కేంద్రం నుంచి మాయమాటలే తప్పా.. చేతలు కనిపించడంలేదని దుయ్యబట్టారు. లోపాయికార ఒప్పందాల కోసమే వైసీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రులు కూలీలుగా మారిపోతున్నారని రామ్మోహన్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.