రేపటి నుంచి విశాఖలో పవన్‌ పోరాట యాత్ర

Pavan kalyan
Pavan kalyan

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఉత్తరాంధ్ర మేధావులతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. వామపక్ష ప్రతినిధులైన ప్రొ. కెఎస్‌. చలం, ప్రొ.కెవి.రమణలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబాటుతనంపై చర్చించనున్నట్లు సమాచారం. విశాఖలో రేపటి నుంచి పవన్‌ పోరాటయాత్ర ప్రారంభంకానుంది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన చోడవరం, పెందుర్తి, అనకాపల్లి, గాజువాక, భీమిలితో పాటు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలోను పర్యటిస్తారు. జూలై 8తో విశాఖలో పర్యటన ముగుస్తుంది. పదివేల మంది జనసైనికులతో అదే రోజు విశాఖలో భారీ కవాతు నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజులు విజయవాడ, మరో రెండు రోజులు హైదరాబాద్‌ వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో జూలై 14 నుండి యాత్ర ప్రారంభిస్తారు.