రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం!

bullets
bullets

చిత్తూరు: రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్లు లభించడం తీవ్ర కలకలం రేపింది. రామ్మోహన్‌ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద నుంచి 17 రౌండ్ల 9ఎంఎం బుల్లెట్లను ఎయిర్‌ పోర్టు సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అ తర్వాత మోహన్‌ రెడ్డిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ప్రశ్నించి, అనంతరం పోలీసులకు అప్పగించారు.