రూ. 2 కోట్ల గంజాయి స్వాధీనం

Ganjai
Ganjai

విశాఖ: జిల్లాలోని పాయకరావుపేట వై.జంక్షన్‌ వద్ద భారీగా గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 1113 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ గంజాయి విలువ రూ. 1.67 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది.