రాష్ట్ర సమస్యలు పట్టని జగన్‌

KALA VENKATARAO
KALA VENKATARAO

అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఏనాడైనా ప్రజల కోసం పనిచేశారా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం మోది, అమిత్‌షాతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు నిధులపై ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. రాఫెల్‌ కుంభకోణంపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని లేఖలో కళా వెంకట్రావు పేర్కొన్నారు.