రాష్ట్రాన్ని కుంభకోణాల పుట్టగా మార్చిన‌ చంద్రబాబు

vijaya sai reddy
vijaya sai reddy

వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రానికి వదిలస్తే ఈ పాటికి పూర్తయ్యేదని, రాష్ట్రమే చేపడుతుందని చెప్పి వ్యయాన్ని అడ్డగోలుగా రూ.58వేల కోట్లకు పెంచారని, ఖర్చుకు లెక్క చూపకుండా, యూసిలు పంపకుండా రాష్ట్రవరప్రదాయినిని కుంభకోణాల పుట్టగా నాయుడుబాబు మార్చారని వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. రాజకీయ చరమాంకంలో ఉన్న జెసి దివాకర్‌ జాతీయ స్థాయి దళారీ అయిన మీ ప్రసన్నం కోసం, ప్రజలని కాకుండా మిమ్మల్ని చూస్తే జగన్‌ను, రెడ్డి సామాజిక వర్గాన్ని తిడుతుంటే మీ ముఖంలో ఈరోజు కనిపించిన ఆనందం ఏ సభ్యత సంస్కారాలకు నిదర్శనమో చెప్పగలరా? ఇలాంటి సభల పెట్టటానికి మీకు సిగ్గు ఉందా అంటూ ప్రశ్నించారు. బిజెపి వ్యతిరేఖ ఫ్రంట్‌ పేరుతో మీరు వీణలు బహుకరించిన వారంతా కెసిఆర్‌ను స్వాగతించి ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలను అభినందిస్తున్నారు. అఖిలేష్‌ యాదవ్‌ తానే స్వయంగా కెసిఆర్‌ను కలుస్తానని ప్రకటించారు. మీ యాత్రలన్ని ఫెయిల్‌ అయినట్లు ఉన్నాయి చంద్రంసారూ అంటూ ట్వీట్‌ చేశారు. గెలిచిన వారికే గొడుగులు పడతారు. విభజన హామీలకు ప్రత్యేక హోదాకు నాలుగున్నర సంవత్సరాలుగా తుప్పు పట్టించిన మీరు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి రాష్ట్ర డబ్బుతో ఎన్నికలకు మూడు నెలల ముందు శంకుస్థాపన చేస్తారా? చుట్టూ కొన్న వేల ఎకరాల కోసం మీరు ఆడుతున్న నాటకం ఇప్పటికే కడప ప్రజలకు అర్థమైందన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన 2018 అతి పెద్ద జోక్‌గా చెప్పొచ్చు. 18వేల కోట్లతో నిర్మిస్తారట. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫకేషన్‌ వస్తుంటే ఎవరిని మోసం చేయడానికి నాయుడుబాబు ఈ హడావుడి. టెండర్లు లేవు. టెక్నాలజీ ఎంపిక జరగలలేదు. బినామీల రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమేనా అంటూ ప్రశ్నించారు. స్వంతవూర్లో ఉపాధి దొరికితే వలస వెల్లరు. పని కల్పించడంలో విఫలమైన చంద్రబాబు రాయలసీమ, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు సరదా కోసం వలస వెళ్లారని అనడం వారిని అవమానించడమే. గతంలో పాలమూరు ప్రజలను ఇలాగే హేళన చేస్తే తరిమి కొట్టారని, వలస జీవుల తడాఖా ఈ సారి ఎన్నికలో రుచి చూపిస్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.