రాబోయే కాలంలో విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తాం

KALA VENKATARAO
KALA VENKATARAO

అమరావతి: ఏపి మంత్రి కళా వెంకట్రావు ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదని… రాబోయే కాలంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఆయన తెలిపారు. ఏపీలో సంస్కరణల వల్ల నష్టాలు 9.75 శాతానికి తగ్గాయన్నారు. రాయలసీమలో మరో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాలకు విద్యుత్ రంగంలో రూ. 8వేల కోట్ల సబ్సిడీ చెల్లింపు ఉంటుందని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు.