రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

rajnath singh
rajnath singh
కడప: మోదీ పాలనతో అగ్రరాజ్యాల సరసన భారత్‌ చేరిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పీవీ సంస్కరణలతో దేశాన్ని మహాశక్తిగా తీర్చిదిద్దితే.. అదే సంస్కరణలతో బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు వచ్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. శాంతిభద్రతలు కాపాడేందుకు మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలు బతికి బట్టకట్టలేవని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.