మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం

ap cabinet
ap cabinet

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. జూన్ 2 నుండి 8 వరకు జరిగే నవనిర్మాణ దీక్షల నిర్వహణ, జూన్ నుండి ఇవ్వనున్న నిరుద్యోగ భృతి, అగ్రిగోల్డ్‌పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఉద్యోగుల సీపీయస్‌ విధానం రద్దు, 216 అన్న క్యాంటిన్లపైనా చర్చ జరుగనుంది. 10వ పీఆర్సీ బకాయిలు, వివిధ సంస్థలకు భూకేటాయింపులపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు.