మోసాల‌కు పాల్ప‌డే వ్య‌క్తుల‌ను, సంస్థ‌లను వ‌దిలిపెట్ట‌నుః చంద్ర‌బాబు

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

అమరావతి: అగ్రిగోల్డ్ వ్యవహరం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ముఖ్య‌మంత్రి చంద్రబాబు అన్నారు.
డిపాజిటర్లకు ముందుగా డ‌బ్బులు ఇవ్వాలని సుభాష్ చందర్‌కు సూచించానని తెలిపారు.‘‘అగ్రిగోల్డ్, కేశవరెడ్డి సంస్ధల
ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయగలుగుతున్నామ‌ని, ఇదే విధంగా జగన్ కూడా తన ఆస్తులను స్వాధీనం
చేస్తే అసలు సమస్యే ఉండదు కదా, మోసాలకు పాల్పడేవారిని, సంస్ధలను వదిలి పెట్టను’’ అని ఆయ‌న హెచ్చ‌రించారు.