మోది కళ్లు తెరిపించేందుకే సియం దీక్ష

Devineni Umamaheshwararao
Devineni Umamaheshwararao

విజయవాడ: అధికార గర్వంతో ప్రధాని మోది కళ్లు మూసుకుపోయాయని, ఆ కళ్లు తెరిపించేందుకే ఏపి సియం చంద్రబాబు దీక్ష ప్రారంభించారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిన్న ఏపిలో మోది అన్నీ అబద్ధాలు చెప్పారని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఏపికి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలనేది తమ డిమాండ్‌ అని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం విషయంలో కేంద్రం అడిగిన లెక్కలన్నీ ఇచ్చామని, తుది అంచనాలకు కేంద్రం ఆమోదం తెలపాలన్నారు. ఏపికి రావాల్సిన బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉమ డిమాండ్‌ చేశారు.