మెట్రోప్రాజెక్టు నివేదిక ఇంకో నెల రోజుల్లో సిద్ధం

 metro
metro

విజయవాడ :  అమరావతి రాజధాని ప్రాంతంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సవివరణ నివేదిక  మరో నెల రోజుల్లో సిద్ధం కానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి  ఇప్పటికే మధ్యంతర డీపీఆర్‌ ఇచ్చిన శిష్ట్రా కన్సార్షియం సర్కార్‌ ఆలోచనలు, అధికారులు సూచనల మేరకు మార్పులు చేర్పులు చేస్తోంది. మొత్తం 73 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో  ప్రాజెక్టు రానుంది.  ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మించాలని భావిస్తున్నారు.  మొదటి దశలో విజయవాడ నగరంలో, ఆ తర్వాత రాజధాని ప్రాంతానికి అనుసంధానించేలా  ప్రణాళిక సిద్ధమవుతుందని అమరావతి మెట్రో రైల్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.