మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదు

AP PCC RAGHUVEERA
AP PCC RAGHUVEERA

మూడో ఫ్రంట్‌కు అవకాశం లేదు

పిసిసి చీఫ్‌ రఘువీరా

మడకశిర: భారతదేశంలో థర్ట్‌ ఫ్రంట్‌కు ఏమాత్రం అవకాశం లేదని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం అనంత పురం జిల్లా మడకశిర పట్టణంలోని కోల్డ్‌ స్టోరేజ్‌ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ యుపిఎతో కూడుకున్న కాంగ్రెస్‌ పార్టీయే ప్రత్యామ్నాయం అని గుర్తు చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని కాంగ్రెస్‌ విజయం తథ్యం అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి జారిపోతున్న జనాన్ని, వర్గాల వారికి ఆశ చూపే ప్రయత్నం ఈ బడ్జెట్‌ చేశారన్నారు. బిసిలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని, ఈ బడ్జెట్‌లో వారికి ద్రోహం చేశారన్నారు.