మునిసిపల్‌ వార్డుల ఉప ఎన్నికల్లో తెదేపా విజయం

AP Tdp Office
AP Tdp Office

మునిసిపల్‌ వార్డుల ఉప ఎన్నికల్లో తెదేపా విజయం

అమరావతి: ఎపిలోని పలు మునిసిపాలిటీ వార్డు ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు.. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, కడప, విజయనగరం, విశాఖజిల్లాల్నోఇ పలు మునిసిపల్‌ వార్డుల్లో ఆదివారం జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ ప్రకటించారు.. మంగళగిరి మునిసిపాలిటీలో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది.. మాచర్ల, గుడివాడ, పలమనేరు, హిందూపురం, తాడిపర్తి, ఆత్మకూరుల్లో వార్డుల్లో తెలుగు దేశం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.. కడపలో రెండు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు..ఉప ఎన్నికల్లో తెదేపా పేచేయి సాధించినప్పటికీ రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో వైకాపా విజయం సాధించటంతో తెదేపాకు ఎదురుదెబ్బే అని అంటున్నారు.