మహానాడులో 8 తీర్మానాలు అమోదం

MAHANADU
MAHANADU

హైదరాబాద్‌: గురువారం జరిగిన టిడిపి-టిఎస్‌ మహానాడు వివిధ అంశాలపై రూపొందించిన 8 తీర్మానాలపై చర్చించి ఆమోదించారు. ఇందులో అమలుకు నోచుకోని టిఆర్‌ఎస్‌ హామీలు అనే తీర్మానాన్ని పార్టీ నాయకురాలు స్వర్ణకుమారి ప్రవేశపెట్టగా, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆమోదించారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం అనే తీర్మానాన్ని పాల్వాయి రజనీకుమారి ప్రవేశపెట్టగా, సండ్ర ఆమోదించారు. టిఆర్‌ఎస్‌ పాలనలో కొరవడిన సామాజిన న్యాయం అనే తీర్మానాన్ని బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రవేశపెట్టగా బోట్ల శ్రీనివాస్‌, లక్ష్మన్‌నాయక్‌లు ఆమోదించారు. నిరుద్యోగ సమస్య-ఉపాది అవకాశాలు-పరిశ్రమల మూసివేతను టిఎన్‌టియూసి రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్‌.రెడ్డి ప్రవేశపెట్టగా, శరత్‌చంద్ర బలపరిచారు. పెండింగ్‌ ప్రాజెక్టులు-ప్రాజెక్టుల రీడిజైన్‌ తీర్మానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్‌బాబు ప్రవేశపెట్టగా..గట్టు ప్రసాద్‌బాబు బలపరిచారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు-అస్తవ్యస్త పాలనను గంధం గురుమూర్తి ప్రవేశపెట్టగా, సామా రంగారెడ్డి, పెద్దిరెడ్డి బలపరిచారు. బడ్జెట్‌ కేటాయింపు-అంకెల గారడి తీర్మానాన్ని చిలువేరు కాశీనాథ్‌ ప్రవేశపెట్టగా..కొమ్మినేని సాయివికాస్‌ బలపరిచారు.