మరో విచిత్ర వేషధారణలో ఎంపి

MP Siva prasad
MP Siva prasad

న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు కోసం టిడిపి ఎంపీలు తీవ్రతరం చేశారు. పార్లమెంటు ఆవరణలో 18వ రోజూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేత బట్టి నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ ఈ రోజు విచిత్ర వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్ని వేషాలేసినా మోది మనసు కరగడం లేనందనే ఇక తప్పక ట్రాన్స్‌ జెండర్‌ వేషం వేయాల్సి వచ్చిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపికి ఆది చేస్తాం..ఇది చేస్తాం అని చెప్పిన మోది ఇప్పుడు అవన్నీ మరిచిపోవడం దారుణమని అన్నారు. రోజుకొక విచిత్ర వేషధారణలతో ఆందోళన చేస్తున్న శివప్రసాద్‌ను ఈ రోజు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ , సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అభినందించారు.